Header Banner

చేబ్రోలు కిరణ్ కుటుంబం దారుణ ఆర్థిక కష్టాల్లో.. విరాళాల అభ్యర్థన! ఆదుకునేందుకు టీడీపీ స్పందన!

  Sat Apr 12, 2025 17:33        Politics

వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని దారుణంగా దూషించిన కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ తో పాటు ఆయన కుటుంబం కూడా కష్టాల్లో ఉంది. ఆయన కుటుంబ ఆర్దిక పరిస్ధితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ అయి ఇంట్లో మంచానికే పరిమితమైన నాన్న, పనికి వెళ్లలేక ఇబ్బందుల్లో ఉన్న అమ్మ.. ఇలా పలు రకాలుగా కుటుంబం ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిపై చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా పోలీసులతో కేసు కూడా పెట్టించింది. ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడేందుకు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్ధితుల్లో ఉన్న చేబ్రోలు కిరణ్ కు కుటుంబాన్ని పట్టించుకునే పరిస్ధితి లేదు.


ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!


దీంతో తిరిగి టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. చేబ్రోలు కిరణ్ కుటుంబ ఆర్దిక పరిస్ధితిని వివరిస్తూ ఫొటోలు, పోస్టులు పెడుతున్నారు..
అంతే కాదు చేబ్రోలు కిరణ్ ఆవేశంలో తప్పు చేశాడని సమర్ధిస్తున్నారు. ఆ తప్పు కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయన కుటుంబం సమస్యలు ఎదుర్కోవడం సరికాదని చెప్తున్నారు. ఇదే కారణంతో ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. అలాగే ఆయన తల్లి బ్యాంక్ పాస్ బుక్, అకౌంట్ వివరాలను కూడా షేర్ చేసి విరాళాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదే క్రమంలో టీడీపీ ఎన్నారై విభాగం లక్ష రూపాయలు విరాళంగా కూడా ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు కూడా పెట్టారు. దీంతో టీడీపీ సస్పెండ్ చేసిన చేబ్రోలు కిరణ్ పై పార్టీ నేతల్లో అభిమానం అలాగే ఉన్నట్లు తెలుస్తోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChebroluKiran #TDPSupport #FamilyInCrisis #PoliticalFallout #SupportAppeal